బరువు తగ్గాలంటే.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ తప్పులు అసలే వద్దు..!

-

బరువు తగ్గాలని లావుగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం కొందరు కఠినమైన ఎక్సర్ సైజులు చేస్తుంటే.. మరికొందరు.. కడుపు మాడ్చుకుంటారు. ఇందులో భాగంగానే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి.. డైరెక్టుగా లంచ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా..? ఇంకో బ్యాచ్ ఉంటుంది.. టిఫెన్ లో పూరీలు, వడలు, దోసలు, తినేసి.. మధ్యాహ్నం తక్కువ తిందాం అనుకుంటారు. ఇలా చేయడం కరెక్టేనా. ? బరువు తగ్గాలంటే..బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలి.. అసలు బ్రేక్ ఫాస్ట్ తింటే మంచిదా.. మానేస్తా మంచిదా చూద్దాం.

బరువు తగ్గాలనుకుంటే డిన్నర్‌పై మాత్రమే కాకుండా, బ్రేక్‌ ఫాస్ట్‌పై కూడా దృష్టిసారించాలి. మీరు ఉదయం 6 గంటలకు లేచారనుకోండి.. టిఫిన్ ఏ 9కో 10కో తింటుంటారు. అలా అస్సలు చేయకూడదు. నిద్రలేచిన గంటలోపు టిఫెన్ చేసేయ్యాలి. ఒకవేళ స్ప్రౌట్స్ లాంటివి తింటే.. ఇవి తిన్న రెండు గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తినొచ్చు. నిద్రలేచిన తర్వాత మాత్రం ఎక్కువసేపు కడుపుకాళీగా ఉంచకూడదనేది ముఖ్యమైన విషయం.

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా.?

కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీరు మీ బ్రేక్‌ ఫాస్ట్‌ మిస్ చేస్తే అది మీ మెటబాలిజం రేటును తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయకూడదు.. కొంతమంది ఉదయంపూట గుడ్లు మాత్రమే తింటారు. అందులో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. పచ్చసొనను వదిలివేస్తారు. ఇలా చేయడం సరికాదు. రోజు మొత్తంలో రెండు గుడ్లు తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

అలాగే ఇంకొందరు పండ్లను మాత్రమే తీసుకుంటారు.. దానివల్ల విటమిన్లు, ఖనిజాలను మాత్రమే పొందుతారు. కానీ వారి కేలరీల సంఖ్య బాగా తగ్గుతుంది. వారు తగినంత ప్రోటీన్, పిండి పదార్థాలు, మంచి కొవ్వును పొందలేరు. అందువల్ల జీవక్రియ రేటు బాగుండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, పిండి పదార్థాలు, మంచి కొవ్వును చేర్చుకోవడం ముఖ్యం.

బ్రేక్ ఫాస్ట్ లో నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాలు, రెండు ఫ్రూట్స్, పచ్చికొబ్బరి, స్ర్పౌట్స్, వీటితో పాటు.. ఖర్జూరం ఇవన్నీ తింటే.. బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు అవుతుంది. బాడీకీ కావాల్సినవి అన్నీ అందుతాయి. మీ డైట్ కూడా కంట్రోల్లో ఉంటుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news