ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ విడిపోకుండా ఉండాలంటే తెలంగాణ ఉద్యమం ఇలాంటివి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే అంతటా అభివృద్ధి జరగాలని అభివృద్ధిలో అన్ని ప్రాంత ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా అత్యవసర సమావేశాలు జరగక ముందు మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రోజా చంద్రబాబు సర్కారుపై మిస్సైల్ లాగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజకీయాలలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం గురించి అనేకమంది ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపించే విధంగా తాజాగా వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ముగ్గురు పిల్లలు సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 3 రాజధానులు ఉంటే తప్పేంటి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నిస్తూ.. ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే అందర్నీ సమానంగా చూడాల్సిన బాధ్యత తల్లికి ఉంటుంది కదా…? ఒకరిని బాగా చూసి, మరోకరిని మాడ్చదు కదా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు జోలెపట్టి అడ్డుక్కుతింటున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కూకట్ పల్లి నుండి అల్లరి మూకలను రౌడీలను తీసుకువచ్చి ఉద్యమం పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలో రౌడీయిజం చేస్తూ ఆ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని చంద్రబాబు కేవలం 29 గ్రామాలకు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారంటూ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.