రోమ్ మాస్టర్స్ టోర్నమెంట్ 2023: రికార్డ్ సృష్టించిన నోవాక్ జొకోవిచ్ … యు ఛాంపియన్.. !

-

ప్రపంచంలోని ఆదరణ దక్కించుకున్న స్పోర్ట్స్ లో టెన్నిస్ కూడా ఒకటి. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలలో ఈ టెన్నిస్ ను విరివిగా ఆడుతున్నారు. కాగా తాజాగా రోమ్ మాస్టర్స్ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రపంచ మెన్ ర్యాంకింగ్ లో టాప్ 2 లో ఉన్న సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ టోర్నమెంట్ లో నోవాక్ జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ టోర్నమెంట్ లో 17 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా ఘనతను సాధించాడు. కాగా ఇంతకు ముందు వరకు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరుకొని ముందంజలో ఉండగా , ఇప్పుడు జొకోవిచ్ ఆ రఫెల్ కన్నా ముందున్నాడు.

జొకోవిచ్ ఈ టోర్నీని 2007 నుండి ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ప్రతీ టోర్నమెంట్ లోనూ క్వార్టర్ కు చేరుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news