విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు

-

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు మే 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఫలితాల్లో ఫైయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు నిర్వహిస్తామని తెల్పగా.. షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు.

Ts Inter First Year result 2021: Telangana Inter results 2021 announced:  49% first-year students pass

జూన్ 12 నుండి 20 వరకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈయర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్స్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది. అటు ఇప్పటికే ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 19 వరకు ఇంటర్‌ బోర్డ్‌ పొడిగించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news