సీనియర్ రాజకీయ , మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తీరని లోటు కలిగించాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో స్నేహభావంతో మెలిగిన రోషయ్య మరణం పట్ల తెలుగు రాష్ట్రాలతో కాకుండా దేశవ్యాప్తంగా పలు పార్టీల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు రోషయ్య మరణం తీరని లోటుగా… ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు.
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కొణిజేటి రోషయ్య మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. రోషయ్య, నేను ఒకే సారి సీఎంలుగా పనిచేశామని అన్నారు. తమిళనాడు గవర్నర్ గా పనిచేసే సమయంలో ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయనవి మరవలేని సేవలని కొనియాడారు ప్రధాని మోదీ. రోషయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా..అని మోదీ అన్నారు. అటు రోషయ్య తనకు చిరకాల మిత్రుడని.. ఓర్పు నేర్పు తెలిసిన మంచి వక్త అని అందరి అభిమానం పొందారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.