కడప జిల్లా : టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు పై ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రజా గౌరవ సభల పేరుతో మా అందరికి సోదరి సమానులైన చంద్రబాబు తన సతీమణి పై వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఒక స్త్రీని ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టదాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా ఒకే గౌరవమే ఇస్తానని తెలిపారు.
ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పే.. ఇక ఈ విషయానికి ముగింపు పలకాలని నేను ఒక ఎమ్మెల్యే గా విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు.. ”భువనేశ్వరి అక్క కూడా తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించ పరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతి ఇస్తే ఎమ్మెల్యే లమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతాం..” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సత్య హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం భార్య ను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే.. ఈనాడు ఈ చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారుకీడ్చడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.