కన్నడ నాట ట్రిపుల్ ఆర్ కు నిరసన సెగ…. బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్

-

దేశం మొత్తం ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఎల్లుండి మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మానియా నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచానాలు భారీగా ఉన్నాయి. దీంతో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. 

ఇదిలా ఉంటే కర్ణాటకలో మాత్రం ట్రిపుల్ ఆర్ సినిమాను బ్యాన్ చేయాలంటూ… అక్కడి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను అవమానించేలా….తక్కువ థియేటర్లలో కన్నడ భాషలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేస్తున్నరాంటూ… ‘‘బాయ్ కాట్ ట్రిపుల్ ఆర్ ఇన్ కర్ణాటక’’ అంటూ ట్విట్టర్ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్ారు. మరోవైపు దివంగత సినినటుడు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘ జెమ్స్’ మూవీ రన్ అవుతున్న థియేటర్లను ‘ ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అవుతుండటంతో పునీత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news