వైఎస్‌ షర్మిల పాదయాత్రలో తేనెతీగల దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఊహించని పరిణామం ఎదురైంది. వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో తేనెటీగలు దాడి చేశాయి. గ్రామస్తులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా షర్మిల బృందంపై తేనెటీగలు దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ తేనె తీగల దాడి నుంచి వైయస్ షర్మిల మాత్రం చాలా చాకచక్యంగా బయటపడింది.

కానీ వైయస్సార్ టిపి పార్టీ కార్య కర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు నుంచి పాదయాత్రగా ఆత్మకూర్ కు వైయస్ షర్మిల వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వైయస్ షర్మిల ఆరోగ్యం క్షేమంగానే ఉంది.

షర్మిల తేనె టీగల దాడి నుంచి తప్పించు కోవడం తో.. ఆమె అభి మానులు, కార్య కర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఇక సంఘటన అనంతరం.. వైఎస్‌ షర్మిల తన పాద యాత్రను.. యథావిధంగా కొనసాగిస్తున్నారు. గత వారం రోజుల కిందట.. వైఎస్‌ షర్మిల పాద యాత్ర చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news