ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా… ఎప్పుడంటే…?

-

టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ఇండియన్ సినిమా మొత్తం చదువుతుంది. ఈ సినిమా విడుదల కోసం మెగా, నందమూరి అభిమానులు అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ముందు ఈ ఏడాది జూలై చివర్లో విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. కాని అది కాస్తా దసరా తర్వాత మార్చారు.

మళ్ళీ కొన్ని పనుల నిమిత్తం వచ్చే ఏడాది జనవరి 8 కి వాయిదా వేసారు. ఇక ఇప్పుడు పరిస్థితులను చూస్తే… ఈ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది. షూటింగ్ ని తిరిగి ఎప్పుడు మొదలుపెడతారు అనేది స్పష్టత రావడం లేదు. సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది.

కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 80 శాతం వరకు షూటింగ్ పూర్తి అయినా సరే… కొన్ని పనులు వాయిదా పడుతున్నాయి. ఎడిటింగ్, డబ్బింగ్, అలాగే షూటింగ్ లో కొన్ని కీలక భాగాలు రీ షూట్ చెయ్యాల్సి ఉండటంతో వాయిదా పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తేదీ ప్రకటించకపోయినా సరే ఈ సినిమాను మాత్రం మే రెండో వారంలో విడుదల చేస్తారని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, అక్కడి స్టార్ హీరోయిన్ అలియా బట్ నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news