కేసీఆర్ కీలక నిర్ణయం; రేపు చికెన్ షాపులు బంద్…?

-

తెలంగాణా లో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే జనం మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా కంటే రాష్ట్రంలో కరోనా చాలా కట్టడిలో ఉందీ అనే విషయం తెలిసిందే. కేవలం ఆస్పత్రులలో, క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు మాత్రమే కరోనా వస్తుంది. ఇది తెలంగాణకు ఊపిరి పీల్చుకునే విషయం. అయినా సరే జనం మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. చికెన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. చికెన్ షాపులను బంద్ చేయడం లేదా… వాళ్లకు ఇంత సమయం అని పెట్టడం లేదా… అక్కడ పోలీసులను మోహరించడం చెయ్యాలని యోచిస్తుంది. దీనిపై ఇప్పటికే డీజీపీ తో తెలంగాణా సిఎం కేసీఆర్ చర్చలు కూడా జరిపారని సమాచారం.

జనం భారీగా గుమిగూడటంపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ ఇక వాళ్ళను కట్టడి చెయ్యాలని భావిస్తుంది. చికెన్ షాప్ వద్ద పది మంది కంటే ఎక్కువ వద్దని… వాళ్ళు కూడా సామాజిక దూరం పాటించకపోతే మాత్రం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిని కఠినం గా అమలు చేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కేసీఆర్ అధికారులకు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news