“ఆర్ఆర్ఆర్” ఫాన్స్ కు గుడ్ న్యూస్ : మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

-

సినీ ప్రేమికులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న ప్ర‌ముఖ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు భారీ హైప్ ను పెంచేశాయి. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా విడుదల తేదీని ఆర్ఆర్ఆర్ మూవీ బృందం ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా అంటే జనవరి 12 వ తేదీ న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సంచారం అందుతోంది. ఈ విడుదల తేదీని కూడా.. రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించాలని చిత్ర బృందం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యం లోనే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ కూడా ట్విటర్ లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా మొదట్లో అక్టోబర్ 13 న విడుదల చేయాలని చిత్ర బృందం అనుకున్న సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news