ఈరోజుల్లో కడుపునిండా భోజనం చేయాలంటే. కనీసం వంద రూపాయలైనా పెట్టాల్సిందే.. నిజానికి వందకు కూడా ఏంరావు.. ఓవైపు ఊడుతున్న ఉద్యోగాలు..మరోవైపు ఎగబాకుతున్న నిత్యవసరాల ధరలు.. దొరికిందే ఛాన్స్ అని వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు.. అలాంటి పరిస్థితుల్లో లక్నోకు చెందిన ఓ వ్యక్తి మాత్రం పది రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నారు. రోజూ 700 మందికి పైగానే అతని దగ్గర భోజనం చేస్తారట..
లక్డీకాపూల్‌లోని గోమతి నగర్‌లోని పాత్రకర్‌పురం కూడలి దగ్గర ప్రజలకు రూ.10కి ఫుల్ భోజనం పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అక్షయ్ ఆహార్ సంస్థ పేరుతో కేంద్రీయ విద్యాలయ సమీపంలోని గోమతీనగర్ లో రూ.10కే మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. దాదాపు రెండేళ్లుగా ఇలా రోజూ 700 మందికి పైగా ఇక్కడ భోజనం చేస్తున్నారు.. విశేషమేమిటంటే.. అన్నదాతల వరుసలో ఆటోడ్రైవర్లు, రిక్షా కార్మికులు, దుకాణదారులతో పాటు పెద్ద పెద్ద వాహనాలను ఆపి ఈ ఆహారాన్ని తీసుకెళ్లి కారులో కూర్చొని తింటారట…
ఆహారం పూర్తిగా స్వచ్ఛమైనదని ఈ సంస్థ వ్యవస్థాపకుడు సుకాంత్ జైన్ పేర్కొన్నారు.. వెల్లుల్లి, ఉల్లిపాయలను ఉపయోగించని జైన సంప్రదాయం ప్రకారం.. ఆహారం తయారు చేస్తారట… కోవిడ్-19లో ప్రజలకు ఆహారం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. అక్షయ్ ఆహార్ సంస్థ 2019లో స్థాపించారు.. కోవిడ్-19లో ప్రజలకు ఉచితంగా ఆహారం అందించారు. ఇప్పుడు అందరికీ 10 రూపాయలకే భోజనం పెడుతున్నారు.
ప్రజలకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. మొత్తం ఆహారం ప్రతిరోజూ అయిపోతుంది. ఎవరైనా తమ పూర్వీకుల పేరుతో లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఆహారం పెట్టాలనుకుంటే, వారిని సంప్రదించవచ్చని సుకాంత్ జైన్ తెలిపారు. ఇక్కడ ప్రతిరోజూ మెనూ మారుస్తారట..
ఇలాంటి వారిని చూసినప్పుడు ఈ దేశంలో ఇంకా మానవత్వం, సాయం చేసే గుణం మనుషుల్లో ఏదో ఒక మూల బతికే ఉందని అనిపిస్తుంది.. రోజులు చాలా మారిపోయాయి.. ఒకప్పుడు మన నాయనమ్మల కాలంలో.. ఇంటికి ఎవరొచ్చినా ముందు కడుపునిండా విస్తర వేసి అన్నం పెట్టేవాళ్లు..వాళ్లు మనోళ్లా కాదా అని చూడకపోయేది.. కానీ ఈరోజుల్లో అలా లేదు.. ఇంట్లో నలుగురు ఉంటే.. ఆఖరి వారు తినేదానికే సరిపడా ఆహారం వండుకుంటున్నారు..పొరపాటున తినే టైమ్‌కు ఎవరైనా వస్తే..మళ్లీ వంట చేయాల్సిందే..!