Vaarasudu : ‘రంజితమే’ కొరియోగ్రాఫర్ వెర్షన్ చూశారా..?

-

ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ అయిన తమిళ సినిమా వారిసు. ఇళయదళపతి విజయ్ నటించిన ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలోని ‘రంజితమే’ పాట థియేటర్లను షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. విజయ్‌ – రష్మిక జోడీ వేసిన స్టెప్పులను ఫ్యాన్స్‌ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్‌లోనూ ఈ పాట 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ పాటపై ఇప్పటికే చాలా రీల్స్, కవర్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఇక ఏ ఈవెంట్ లో చూసినా ఈ పాటే మార్మోగుతోంది.

ఈ పాటకు జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన బృందంతో కలిసి స్టేజ్‌ దద్దరిల్లిపోయేలా స్టెప్పులేసి.. అక్కడ ఉన్న వారందర్నీ అలరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వావ్‌.. సూపర్‌ మాస్టర్‌’ అనకుండా ఉండలేకపోతున్నారు.

ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’ డ్యాన్స్‌ రియాల్టీ షోతో కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ.. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు నటించిన చిత్రాల కోసం పనిచేశారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పేరు సొంతం చేసుకున్నారు. ఈక్రమంలోనే విజయ్‌ నటించిన గత చిత్రం ‘బీస్ట్’లోని ‘హలమితి హబీబో’కు కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఇప్పుడు మళ్లీ ‘రంజితమే’ పాట కోసం విజయ్‌తో వర్క్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news