“ఇంట్లోకి దూరి ఉగ్రవాదులను చంపేస్తాం”.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..!

-

పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాని బుధవారం పేర్కొంది. అమెరికా అత్యున్నత అధికారి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల ఏప్రిల్ 5న బ్రిటిష్ వార్త పత్రిక ది గార్డియన్ ఒక కథనంలో.. పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగున్న టార్గెటెడ్ హత్యల్లో భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. అయితే, గార్డియన్ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు సరిహద్దులను కూడా దాటేందుకు భారత్ వెనకడాడని వ్యాఖ్యానించారు. “ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం” అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. “అమెరికా ఈ సమస్య మధ్యకు రావాలనుకోవడం లేదు. అయతే, భారత్- పాకిస్తాన్ పరిస్థితి తీవ్రత పెంచకుండా చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాలని ప్రోత్సహిస్తాం” అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిథి మాథ్యూ మిల్లర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news