ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై స్పందించిన ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి

-

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై స్పందించారు ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో లెఫ్టినెంట్ గవర్నర్ బిజెపి నాయకుడితో ప్రెస్ మీట్ పెట్టించారని, కేంద్రం తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బాజిరెడ్డి.

దాన్ని బయటపెట్టినప్పటినుండి కవితను టార్గెట్ చేశారని అన్నారు. అలాగే అదానీ కేసును కప్పిపుచ్చుకునేందుకు లిక్కర్ కేసును తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. రాజకీయ కక్షలతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ, ఈడీలు కేంద్ర ప్రభుత్వాలు లాలూచీ సంస్థలు అని ఆరోపించారు. బిఆర్ఎస్ ను విస్తరించడం వల్లే కేంద్రం ఈ డ్రామాలు ఆడుతుంది అన్నారు. దేశంలో బిజెపి సోషల్ మీడియాని అంతా అదానీయే నడిపిస్తున్నాడన్నారు. లిక్కర్ కేసులో కావాలనే కవిత పేరును తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు బాజిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news