తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. డీజిల్ ధరలు ఇంకా పెరిగితే బస్ ఛార్జీలు మళ్లీ పెంచే అవకాశం ఉంటుందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీని గట్టేక్కించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
కొంత కాలంగా డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నందున సంస్థపై నిర్వహణ భారం మరింతగా పెరిగిపోతోందని చెప్పారు. టికెట్ ఛార్జీలను పెంచేందుకు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సిటీ ఆర్డీనరీ, పల్లెవెలుగు బస్సుల్లో కనీస ఛార్జీల్లోమార్పులేకుండా డీజిల్ సెస్ రూపంలో టికెట్ పైఊ రూ.2 , ఎక్స్‌ప్రెస్ తదితర బస్సుల్లో రూ.5 చొప్పున పెంచాల్సి వచ్చిందని చెప్పారు. డీజిల్ ధరలు మరింతగా పెరిగితే సెస్ రూంలో ఛార్జీలు పెంచక తప్పదని చెప్పారు. డీజిల్ సెస్ తో ఏడాదికి సుమారు రూ.70 కోట్ల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.