దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్ నిరసన..?

-

తెలంగాణలోని నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2 లో పని చేస్తున్న డ్రైవర్ గణేష్.. శనివారం డిఎం కార్యాలయం వద్ద తన దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పదిహేనేళ్లుగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల (KMPL) మైలేజీ తక్కువ వచ్చింది అని ఆయనను డిఎం కౌన్సెలింగ్ నిర్వహించారు. వారం గడవకముందే మళ్లీ డిఐ పిలిచి.. మైలేజీ తగ్గింది అంటూ మళ్ళీ డిఎం ని కలవాలని చెప్పారు.

దీంతో గణేష్ ఆవేదనకు గురై.. తరచూ ఇలా కౌన్సిలింగ్ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పాత బస్సులతో మైలేజ్ ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ.. తన దుస్తులు విప్పేసి బయటికి వచ్చారు.. తోటి సిబ్బంది ఆయనను అడ్డుకునే సముదాయించారు. తాను కౌన్సిలింగ్ కు హాజరు కావాలని బాధతోనే గణేశ్ ఇలా చేశానని.. సంస్థను కాపాడేందుకు అందరం కలిసి పని చేస్తున్నట్లుగా పేర్కొన్నారు గణేష్.

Read more RELATED
Recommended to you

Latest news