గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి 90 శాతం కాలిపోవడంతో మృతి చెందారు.
శనివారం నాడు ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆస్పత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని రంగంలోకి పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.