రాష్ట్రాన్ని పాలించడం అంటే.. అధిక మొత్తంలో అప్పులు చేయడం, ప్రజల సోమ్మును దోచుకోవడమే అన్నట్టుగా తయారు అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. కాగ పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్థత నెలకొందని ఆరోపించారు.
ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని మండి పడ్డారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞాప్తి చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. కానీ జగన్ కు కొత్త జిల్లాలే ఎందుకు గుర్తు వచ్చాయని అన్నారు. పీఆర్సీ తో పాటు ఇతర సమస్యలను పక్క దారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని ముందుకు తెచ్చారని ఆరోపించారు. అలాగే పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ అనుసరించాల్సిన అంశాల పై కూడా చర్చించారు.