తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

-

గ్యాస్ సిలెండర్ వినియోగదారులకి గుడ్ న్యూస్. సిలెండర్ ధరలు తగ్గాయి. అయితే మరి ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేసారు అనేది ఇప్పడు చూద్దాం. పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రతి నెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను మారుస్తూ వుంటారు. చమురు కంపెనీలు పలు వాటిని చూసి గ్యాస్ సిలెండర్ ధరలను ఫిక్స్ చేస్తారు. ఈ నెలలో కూడా మార్చారు.

దీనితో వాణిజ్య సిలిండర్ల వినియోగించేవారికి రిలీఫ్ కలగనుంది. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌లో మాత్రం మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ అయితే ఈవాళ నుండి రూ.25.5 తగ్గింది. ఇక ఏ ప్రాంతంలో ఎంత తగ్గింది అనేది చూస్తే..

కోల్‌కతాలో రూ.36.5, ముంబై లో రూ.32.5, చెన్నైలో రూ.35.5 తగ్గింది. ఇక ఈవాళ నుండి ఎంత రేటు పడుతుందనేది చూస్తే.. 19 కిలోల ఇండేన్ సిలిండర్ ఢిల్లీలో రూ. 1859.5 వుంది. రూ. 1959గా కలకత్తాలో వుంది. ముంబై లో రూ.1811.5కి గా వుంది. చెన్నైలో రూ.2009.5కి వచ్చేసింది. ఇదిలా ఉంటే గతంలో అయితే సెప్టెంబర్‌ 1న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గగా… దాని కంటే ముంది జూలై లో మార్పులు చేసారు. ఇప్పుడు కూడా ధరలు మరోసారి తగ్గాయి. నేటి నుండి అవి అమలులోకి రానున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news