రష్యా- ఉక్రెయిన్ వార్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతున్న రష్యా సైన్యం

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోంది. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. ఈ రోజు ఉదయమే మొదలైన యుద్ధం… ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనులు కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యాని నిలరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి రష్యాను యుద్ధం ఆపేయాలని కోరింది. 

ఇదిలా ఉంటే చాలా దుందుడుకుగా వెళ్తున్న రష్యన్ ఆర్మీ మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. ఇప్పటికే 13 నగరాలను ఆక్రమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా ఆర్మీ హస్తగతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీవ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రష్యన్ ఆర్మీ అదుపులోకి తీసుకుందని తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే కీవ్, ఖార్కివ్, మెకోలెవ్, ఓడిస్కా, కరమటోర్స్క్, టెర్డియన్క్స్ వంటి ఆరు ప్రధాన నగరాలపై బాంబులతో దాడులు చేసింది రష్యా. ఇతర నగరాల్లోకి చొచ్చుకు వెళ్తూ క్రమంగా ఆక్రమించుకుంటుంది రష్యన్ ఆర్మీ. మరోవైపు ఉక్రెయిన్ నుంచి పెద్దగా ప్రతి ఘటన కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news