మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా… నేనెవరో తెలుసా… సింపుల్ గా అదరగొట్టిన రానా..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను నిర్వహించింది. ఈ ఫంక్షన్లో భాగంగా దగ్గుబాటి రానా మాట్లాడుతూ… మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా… మరి నేనెవరో తెలుసా… అంటూ రానా తన స్పీచ్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో చాలా మంది మేధావులను కలిశాను. నేను ఇండియా లోని చాలా మంది స్టార్ హీరోలతో పని చేశాను… కానీ పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్.

ఇప్పటి వరకూ నేను చేసిన మూవీ లు ఒకలా ఉంటే కళ్యాణ్ గారి ప్రభావంతో ఇకపై నా మూవీ లు మరోలా ఉంటాయి అని దగ్గుబాటి రానా తెలియజేశాడు. మరో మేధావి ఎవరంటే త్రివిక్రమ్… త్రివిక్రమ్ మామూలు వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ కంటే ముందే భీమ్లా నాయక్ సినిమాలో నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ వచ్చారు. నన్ను ఈ మూవీకి తీసుకున్నందుకు నిర్మాతకు ధన్యవాదాలు అంటూ దగ్గుబాటి రానా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తెలియజేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news