ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువస్తున్నారు. ‘ ఆపరేషన్ గంగా ’ ద్వారా భారతీయులను  ఏయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ కు సరిహద్దుల్లో ఉన్న దేశాాలైన హంగేరీ, రోమేనియా, పోలాండ్, స్లోవేకియా నుంచి భారతీయును స్వదేశానికి తరలించారు. ఇప్పటి వరకు 70కి పైగా విమానాలు, ఏయిర్ ఫోర్స్ సీ17 విమానాల ద్వారా 18 వేల మందిని భారత్ కు తరలించారు.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన బంగ్లాదేశీయలు, నేపాల్ దేశస్థులను కూడా భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. తాజాగా ఓ పాకిస్తాన్ యువతిని కూడా సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి రక్షించారు. దీంతో ఆ యువతి భారత ప్రధానికి థాంక్స్ చెప్పింది. ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాకిస్థాన్ చెందిన​ యువతి ఆస్మా షాఫిక్​ కృతజ్ఞతలు తెలిపింది. యుద్ధం జరుగుతోన్న ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్లేందుకు భారత అధికారులు తనకు సాయం చేసినట్లు పేర్కొంది. తన స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news