రష్యా- ఉక్రెయిన్ వార్ లో 79 మంది చిన్నారుల మృతి

-

రెండు వారాల నుంచి రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూనే ఉంది. చిన్నపాటి సైనిక చర్యలా ప్రారంభమైన రష్యా దురాక్రమణ తీవ్రయుద్ధానికి దారి తీసింది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ తీవ్ర విధ్వంసం కలిగిస్తోంది. రాజధాని నగరం కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది రష్యన్ ఆర్మీ. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ ఆర్మీ కూడా రష్యన్ ఆర్మీని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. కేవలం రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుంది అనుకున్నా… రెండు వారాల పాటు రష్యన్ ఆర్మీని నిలవరిస్తోంది. ఇప్పటికే 12 వేలకు పైగా రష్యన్ ఆర్మీని చంపేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.

 

ఇదిలా ఉంటే రష్యా దాడుల్లో చాలా మంది చనిపోతున్నారు. పౌర భవనాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. రష్యా దాడుల వల్ల ఇప్పటి వరకు 79 మంది చిన్నారులు మరణించారని.. 100 మందికి పైగా చిన్నారులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. చిన్నారుల మృతి పట్ల ఆ దేశ ప్రథమ మహిళ వోలెనా జెలన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా దళాలు దాడుల తీవ్రతను పెంచాయి. ఇప్పటి వరకు 202 స్కూళ్లు, 34 ఆస్పత్రులను , 1500 నివసాాలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ ప్రకటించిాంది.

Read more RELATED
Recommended to you

Latest news