ఉక్రెయిన్ పై విరుచుకు పడుతోంది రష్యా. యుద్ధం అనివార్యం అని కూడా నిర్థారించింది.దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడుతు న్నాయి. అమెరికా సైతం యుద్ధాన్ని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయనే అంటోంది.మరోవైపు పుతిన్ కు మద్దతుగా ఉండేందుకు ప్రపంచ దేశాలేవీ ముందుకు రావడం లేదు. ఆర్థికపరమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో యుద్ధం కనుక జరిగితే,ఆ విధంగా ముందున్న పరిణామాలు కనుక తీవ్రతరం అయితే నష్టపోయేది రష్యానే! ఎక్కువ నష్టపోయేది ప్రపంచ దేశాలలో ఒంటరిగా మిగిలిపోయేది కూడా రష్యానే! అందుతున్న వార్తల ప్రకారం రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ను షురూ చేసింది.మరోవైపు సున్నిత అంశాలకు సైతం స్పందించే స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతోనే ఆరంభం అయ్యాయి.200 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్ ప్రారంభం అయిందని సమాచారం వస్తోంది.