ఈ రోజు మొదలైన ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై మంచి రేజింగ్ లో ఉంది. ఓపెనర్ గా వచ్చిన ఋతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ లో మొదటి హాఫ్ సెంచరీని సాధించి చెన్నై ని పటిష్ట స్థితిలో నిలిపాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మొక్కవోని దీక్షతో గైక్వాడ్ చూడచక్కని షాట్ లతో గ్రౌండ్ కు నాలుగు వైపులా పరుగుల వరద పారిస్తున్నాడు.
తన తోటి ఆటగాళ్లు కాం వే 1, స్టోక్స్ 7, మొయిన్ అలీ 23 , రాయుడు 12 లు స్వల్ప స్కోర్ లకే అవుట్ అయినా గైక్వాడ్ (79) గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇతను ఇలాగె ఆడితే సెంచరీ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ధోని ఇంకా క్రీజులోకి రాలేదు…