TSPSC పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులిచ్చే యోచనలో సిట్

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్న సిట్ అధికారులు.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో టీఎస్​పీఎస్సీ సభ్యులను ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, స‌భ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డికి కూడా తాఖీదులు ఇచ్చే అవకాశమునట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో సభ్యుల సలహాలు, సూచనలు ఎలా ఉంటాయి..? ప్రశ్నాపత్రాలు, భద్రపర్చేందుకు కమిషన్ తీసుకునే చర్యల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే వివరాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఛైర్మన్, కార్యదర్శి నుంచి.. సిట్ అధికారులు వివరాలు సేకరించారు. మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాననిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 15ప్రశ్నాపత్రాలున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఇందులో ప్రధాన నిందితులు కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డిలను సిట్ విచారించగా.. ప్రవీణ్‌, అందులో పనిచేసే రమేష్‌, షమీమ్‌లకు కూడా గ్రూప్‌-1 పేపర్‌ అందించినట్లు తెలిసింది. కార్యదర్శి పీఏగా ప్ర‌వీణ్‌, కమిషన్‌ సభ్యుడు బండి లింగారెడ్డికి పీఏగా ర‌మేశ్‌ పని చేశారు. దీంతో ముందుగా కార్యదర్శి, కమిషన్‌ సభ్యుడికి నోటీసులు జారీ చేశారు. వీరి వద్ద నుంచి ఆయా నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news