అయ్యప్ప భక్తులకు శుభ వార్త చెప్పింది శబరిమల ఆలయం కమిటీ. ఇవాళ్టి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని పెరుగుతున్నట్లు ప్రకటించింది. తులామానం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయం తెరుచుకుంది.
ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటన చేసింది. ఇంకా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబరు 21 వరకు భక్తులను అనుమతించ నున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో కరుణ నిబంధనలు పాటించనున్నారు. ఇక ప్రారంభోత్సవం సందర్భంగా ప్రస్తుత తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో దీపాలు వెలిగిస్తారు.
ప్రస్తుత మొయి శంటి.. వి కే జయరాజు పొట్టి ఆలయంలో దీపారాధన చేస్తారు. ఇక ఆలయానికి వెళ్ళేదారిలో 16వ మెట్టు దగ్గర అగ్ని హోమం చేస్తారు. అయ్యప్ప స్వామి దర్శనం నేపథ్యం లో ప్రతి ఒక్కరూ.. కరోనా నియమ నిబంధనలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు. దర్శనం మరియు ఆలయ ప్రాంగణం లో మాస్క్ లు తప్పని సరి అని ఆదేశించారు.