టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ : బిసిసిఐ కీలక ప్రకటన

టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను నియమిస్తూ బిసిసిఐ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్ గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్టు గడువు… 2021 వరల్డ్ కప్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. టీమిండియా తర్వాతి ప్రధాన కోచ్ గా… మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

టి20 వరల్డ్ కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి ప్రధాన కోచ్ గా బాధ్యతలు రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకోనున్నారు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ వరకు… టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగనున్నారు.

ఇక ప్రస్తుతం ఎంసీఏ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్… ఆ పదవికి రాజీనామా చేయబోతున్నారు. అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవి కాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో భారత మాజీ బౌలర్… పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంసీఏ లో రాహుల్ ద్రావిడ్ తో పాటు… పరాస్ బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నారు. తాజాగా వీరిద్దరికి ప్రమోషన్స్ ఇస్తూ బిసిసిఐ ప్రకటన చేసింది.