అడుసుతొక్కనేల కాలుకడుగనేల… ప్రస్తుతం టీడీపీ నేత సబ్బం హరి గురించి విశాఖ వాసులు చెప్పుకుంటున్న మాటలివి! దేవుడు నోరిచ్చాడు కదా అని వెనకా ముందూ చూసుకోకుండా మాట్లాడితే.. ఫలితాలు క్షమాపణలు చెప్పేవరకూ వెళ్తాయని సబ్బం హరికి బాగా తెలిసొచ్చినట్లుంది. ఫలితంగా.. “క్షమించండి.. నోరు జారాను” అని విన్నవిస్తున్నారు!
అవును… “24 గంటల్లో నేనేంటో చూపిస్తా… ఒక్కొక్కరి తాట తీస్తా… నేనంటే ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తా…” అని మొదలుపెట్టి మరింతగా పెట్రేగిపోయిన విశాఖ ప్రవక్త సబ్బం హరి.. “సహనం కోల్పోయి మాట్లాడాను.. ఆవేశంలో అన్న మాటలకు మన్నించాలి” అని కోరుతున్నారు! తానూ మనిషినేనని.. తనకు ఫీలింగ్ ఉంటాయని చెప్పుకొస్తున్నారు!
కాగా… జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన అధికారులతో పాటు.. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి వంటివారిపై కూడా సబ్బం హరి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. తనకు తాను ఎక్కువ ఊహించుకున్నారో లేక తన వెనక ఒక వర్గం మీడియా ఉంది, తన వెనక అంతకంటే బలమైన బాబు ఉన్నాడని భావించారో ఏమో.. ఫుల్ ఫైరయ్యారు!
అనంతరం వాస్తవాలు గ్రహించారో, లేక తాను నమ్ముకున్నవారు సూచించారో ఏమో కానీ.. 24 గంటలు గడిచేలోపే క్షమాపణలు చెప్పారు.. తాను కూడా మనిషేనన్న విషయం గుర్తించమని – తనకు ఫీలింగ్ ఉంటాయని గ్రహించమని కోరారు!
-CH Raja