KTR కృషితో 7 లక్షల మంది జాబులు చేస్తున్నారు – మంత్రి సబితా

-

KTR కృషితో 7 లక్షల మంది జాబులు చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. తాజ్ డెక్కన్‌ హోటల్ లో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆద్వర్యంలో TCS iON, TSOnline సహకారంతో ఉన్నత విద్య లో ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయబిలిటీ” అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయేష్ రంజన్ , ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి,వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్, విద్యావేత్తలు,పరిశ్రమ నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి.. లక్షల మంది చదువులు అయిపోయి బయటికి వస్తున్నారన్నారు. ఉపాధి అవకాశాలు కోసం అనేక శిక్షణ కేంద్రాలపై ఆధార పడుతున్నారని.. క్యాంపస్ లోనే చదవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని వెల్లడించారు. మూస పద్దతిలో కాకుండా డిమాండ్ కి తగ్గట్టు చదివే పరిస్తితి ఉంది.. ఇదే విషయం సీఎం కేసిఆర్ చెప్తున్నారని తెలిపారు. ఐటీ పాలసీలు మార్చుతూ కేటీఆర్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.. కెటిఆర్ కృషి తో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని వెల్లడించారు. 7 లక్షల మంది జాబులు చేస్తున్నారు.. అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news