ఈనెల 25 నుండి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..విద్యాశాఖ మంత్రి క్లారిటీ..!

-

ఈ నెల25నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలపై అన్ని శాఖలతో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంధ‌ర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 25 నుంచి ప్రారంభం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రయబోతున్నరని స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు.sabitha indra reddy

జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని….కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందని చెప్పారు. 25వేల మంది ఇన్విజిలేటర్ లు పాల్గొంటున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఐసోలేశన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రం లోకి అనుమతి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్ష నిర్వహణకు సహకరించాలని స‌బితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘాల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. పరీక్షల టైమ్ లో ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news