RRR సినిమాను అడ్డుకుంటాం : గంగుల

-

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో… హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల ప్రజలు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక పైనే మాట్లాడుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే నిన్న హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… సంచలన వ్యాఖ్యలు చేశారు.

నవంబర్ 2వ తేదీన… ప్రగతి భవన్ ముందు మరియు అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీకి… ఆర్. ఆర్.ఆర్ సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ ఆర్ అంటే… రాజా సింగ్, రఘునందన్ మరియు రాజేందర్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే నిన్న బండి సెండ్ చేసిన ఈ వ్యాఖ్యలకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీ లో RRR సినిమా అసాధ్యమని.. కచ్చితంగా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఉన్న ఇద్దరు R లే ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తున్నారని.. హుజూరాబాద్ టిఆర్ఎస్ దేనని తేల్చి చెప్పారు. గతంలో గెలిసింది…ఇప్పుడు గెల్వబోయేది టిఆర్ఎస్ అని.. కాంగ్రెస్ , బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈటెల కు ఓటమి భయం పట్టుకుందని.. మంచి మెజారిటీ తో టిఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news