కేసీఆర్‌ లక్షణాలే వారి మనువడికి వచ్చాయి : సబితా ఇంద్రారెడ్డి

-

సీఎం కేసీఆర్ మ‌నువ‌డు, కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వకుంట్ల హిమాన్షు గొప్ప మనుసుతో కోటి రూపాయల వ్యయంతో శేరిలింగంపల్లి
నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ కేశవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నూతన సముదాయాన్ని నిర్మించారు. అయితే.. ఈ భవన సముదాయాన్ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు ,ప్రభుత్వ విప్ గాంధీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది పుట్టిన రోజులు స్నేహితులు, బంధువుల మధ్యలో హంగు ఆర్భాటాలతో చేసుకుంటారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు అయిన హిమాన్షు పేద, మధ్య తరగతి విద్యార్థుల మధ్యలో చేసుకోవడం అభినందనీయమన్నారు.

క్యాన్సర్ ఆసుపత్రితో పాటు, అనాధ ఆశ్రమంలో, వృద్ధాశ్రమామంలో జరుపుకోవడం నేటి యువతకు ఒక గొప్ప సందేశం ఇచ్చినట్లయిందన్నారు. తాను చదివే ఒక్రిడ్జి పాఠశాల విద్యార్థులతో కలిసి సేవ కార్యక్రమాలు చేపట్టడటం సంతోషాదాయకం అన్నారు. పేద విద్యార్థులు చదివే కేశవ నగర్ పాఠశాలను దత్తత తీసుకొని అన్ని హంగులతో తీర్చిదిద్దటం ఎంతో గొప్ప విషయం అన్నారు. అదే విధంగా చెరువు సుందరీక‌రణ పనులు చేపట్టడానికి ముందుకురావటం శుభ పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పేద విద్యార్థుల గురించి తపన పడుతుంటారని, అలాంటి లక్షణాలే వారి మనువడికి రావటం జరిగిందన్నారు. కేటీఆర్ కూడా గంభీరావుపేటలో ఒక పాఠశాల ప్రారంభానికి వెళ్లి తన అమ్మమ్మ పేరుతో పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చి పూర్తి చేసారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news