కరోనా వైరస్ ఏమో గాని మీడియా మాత్రం ఇప్పుడు మరో గోల లేకుండా ఉంది. కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తుంది. దీన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు అన్ని విధాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఎక్కడ చూసినా మీడియాలో కరోనా వైరస్ వార్తలు మినహా మరో వార్త అనేది కనపడటం లేదు. రోడ్డు ప్రమాదం జరిగింది అనో,
పలానా నాయకుడు మీడియాతో మాట్లాడారు అనో ఏదోక రూపంలో ఇలా హడావుడి ఉండేది. ప్రజలకు వింతలు విశేషాలు ఎన్నో చూపిస్తూ ఉండేది మీడియా. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అది ఎక్కడా కనపడటం లేదు. మీడియాలో కథనాలు అన్నీ కూడా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతున్నాయి. అక్కడ అన్ని కేసులు అన్ని మరణాలు, ఇన్ని దేశాలు ఇంత మంది వైద్యులు అంటూ ప్రసారాలు.
డాక్టర్ల తో సమావేశాలు నిర్వహించడం చర్చా కార్యక్రమాలు నిర్వహించడం మినహా మీడియాలో ఏ ఒక్క బయట వార్త రావడం లేదు. ప్రతీ వార్త కూడా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు దీనిపై మీడియా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది మినహా ఏ ఒక్కటి కూడా ప్రజలు చదివే పరిస్థితి కనపడటం లేదు మీడియాలో. దీనితో మీడియా కూడా చేసేది లేక కరోనా చుట్టూనే తిరుగుతూ ఉంది ప్రస్తుతం.