నాకు ఎలాంటి నోటీసులు అందలేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు తలసాని సాయికిరణ్ యాదవ్. క్యాసినో వ్యవహారంలో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను విచారించిన ఈడి, తాజాగా ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కి నోటీసులు ఇచ్చిందని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. విచారణకు రావాలని నోటీసులో ఈడీ పేర్కొందని వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే.. ఈ సంఘటనపై స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ స్పందించారు. ED నుండి నాకు నోటీసులు అందాయన్న పుకారు తెలిసి నేను షాక్ అయ్యానని… నేను దానిని ఖండిస్తున్నానని సాయికిరణ్ పేర్కొన్నారు. నాకు ఎలాంటి నోటీసులు అందలేదు లేదా నాకు ఇవ్వడానికి ఎవరూ ప్రయత్నించలేదని తేల్చి చెప్పారు. ఏదైనా వార్తను రాసే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలని… నేను అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను యువ రాజకీయవేత్తను ప్రజలకు నా వంతుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు సాయికిరణ్ యాదవ్.
I’m shocked to learn the rumour that i received notices from ED. I condemn it . I have not received any notice nor anyone tried to serve me . I appeal to all media to pls fact check before presenting any news ,I’m a young politician trying to serve people at my best ,thank you 🙏🏻
— Talasani Sai Kiran (@talasani_sai) November 21, 2022