తనకా అదృష్టం లేదంటూ బాధపడుతున్న సాయి పల్లవి..!!

-

లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఎక్కువగా గ్లామర్ షో కి దూరంగా ఉంటూ అభినయ ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతోపాటు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ల ద్వారా కూడా సత్తా చాటుతోంది. ఇదిలా ఉండగా సాధారణంగా ప్రతి హీరోయిన్ సినీ కెరియర్లో కొన్ని మిస్ అయిన పాత్రలు ఉండనే ఉంటాయి. ఆ పాత్రలలో నటించి ఉంటే తాము మరింత అద్భుతంగా నటించి ఉండే వాళ్ళమని హీరోయిన్లు కొన్ని సందర్భాలలో భావిస్తూ ఉంటారు . అయితే ఆ తరహా పాత్రల గురించి.. తాను రిజెక్ట్ చేసిన పాత్రల గురించి కూడా సాయి పల్లవి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.. అంతేకాదు తనకు ఆ అదృష్టం లేదంటూ కూడా బాధపడింది.

తాను మిస్ చేసుకున్న పాత్రల విషయంలో తాను చేయకపోవడం అనేది ఒక యాదృచ్ఛికం అని ,అయితే ఆ పాత్ర చేయాలని రాసిపెట్టి లేదని, ఆ రీజన్ వల్లే పాత్రలు మిస్ అయ్యాయని భావిస్తానని కూడా సాయి పల్లవి పేర్కొంది. అంతే కాదు తాను విధిని గుడ్డిగా నమ్ముతానని చెప్పిన సాయి పల్లవి ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కడం లేదని కూడా వాపోయింది. నిజానికి ఈ మధ్య ఈమె నటించిన విరాటపర్వం, గార్గి రెండు సినిమాలు కూడా సాయి పల్లవికి విజయాన్ని చేకూర్చలేకపోయాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే సాయి పల్లవి రేమ్యునరేషన్ తక్కువే అయినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు.. ప్రస్తుతం ఈమె ఒక్క సినిమాకు కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాయి పల్లవి సక్సెస్ , ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కెరియర్ కొనసాగిస్తోంది. కనీసం ఇప్పటికైనా తనకు నచ్చిన పాత్రలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news