రికార్డు సృష్టించిన భారత స్విమ్మర్.. ఒలింపిక్స్ అర్హత సమయాన్ని దాటేసాడు

-

సాజన్ ప్రకాష్.. కేరళకి చెందిన ఈ స్విమ్మర్, ఒలింపిక్ అర్హత సమయాన్ని మించిపోయాడు. ఇటలీలోని రోమ్ లో జరుగుతున్న సెట్టె కోలి ట్రోఫీలో 200మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్ లో 1:56:38 సెకండ్లలో చేరుకు ఒలింపిక్స్ గేమ్స్ అర్హత సమయాన్ని దాటేసాడు. 27సంవత్సరాల సాజన్ ప్రకాష్, 2016రియో ఒలింపిక్స్ లో ఇండియా తరపున పాల్గొన్నాడు. అప్పుడు 1:56.48 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇంకా ఇదొక్కటే కాదు వరుసగా సాజన్ ప్రకాష్, తన ప్రదర్శనను మెరుగు పర్చుకుంటూ వస్తున్నాడు.

గత వారంలో బెల్ గ్రేడ్ ట్రోఫీ స్విమ్మింగ్ పోటీల్లో 1:56.96 సెకండ్లలో చేరుకున్నప్పటికీ ఏ క్వాలిఫికేషన్ ని మిస్ చేసుకున్నాడు. మొత్తానికి ప్రస్తుతానికి ఒలింపిక్స్ అర్హత సమయాన్ని దాటేయడంతో భారత్ తరపున ఒలింపిక్స్ కి అర్హత సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ సంవత్సరం ఒలింపిక్ గేమ్ జపాన్ దేశ రాజధాని టోక్యో వేదికగా జరగనున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్ గేమ్ ఈ ఏడాది నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news