షర్మిల కూడా సజ్జలను వ్యతిరేకిస్తున్నారు
అయినా జగన్ మాత్రం ప్రయార్టీ ఇస్తున్నారు
ఆ రోజు కేవీపీ ఎలానో ఇవాళ సజ్జల స్థాయి అంతకు మించి
పనికిమాలిన సలహాదారులు కొందరున్నా వారికి భిన్నం
సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ఓ అతి సాదా సీదా పాత్రికేయుడు
పెద్ద రాతగాడు కాదు కానీ ఏదో రాశాడు అలా ఎన్ ఈ అయ్యాడు
అదేలేండి న్యూస్ ఎడిటర్ అయ్యాడు ఆ తరువా ఈడీ అయ్యాడు
అదేలేండి ఎడిటోరియల్ డైరెక్టర్ అయ్యాడు.. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాడు
తెలంగాణ వైసీపీ వ్యవహారాలు చూశాడు కానీ ఫ్లాప్ అయ్యాడు
అటుపై అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి నే శాసిస్తాండు
దటీజ్ సజ్జల.. కమ్యూనిస్టులకు సాయం చేస్తాడు.. అందులో డౌటే లేదు
పాత్రికేయులను మాత్రం దూరం పెడ్తాండు ఏంటో ఈ విడ్డూరం.
ఆయన గురించి ఇవాళ్టి ఉత్తమ పురుషలో కొంత.. కొండంత మనిషి కోసం కొంత
కొండంత కాదు కొంతఆ వివరం అద్దంలో చూపింతే గోరంత.. కొండ అద్దమంతు కొంచమై ఉండదా? ఆ వివరం ఈ కథనంలో
ఓ మామూలు జర్నలిస్టు.. కొంత కాలం ఈనాడులో చేశాడు.. కొంత కాలం ఉదయంలో చేశాడు. మైనింగ్ లో బాగా సంపాదించాడు కూడా! అన్నయ్య తో కలిసి వ్యాపారాలు చేశాడు. కమ్యూనిజం పుస్తకాలు కొన్ని చదివాడు. ఉదయంలో న్యూస్ ఎడిటర్ గా పనిచేసేవాడు.ఆ రోజుల్లో స్మోకరి.. పొగ వదులుతూ వదులుతూ మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఇస్తూ ఉద్యోగం చేసేవాడు. ఇంకా చెప్పాలంటే పెద్ద రాతగాడేం కాదు. ఆ మాటకు వస్తే అక్కడున్న (సాక్షిలో ఉన్న) వాళ్లంతా ఇవాళ బచ్చా రైటర్లే ! ఆ ఎడిటర్ వర్థెల్లి మురళి కే ప్రాధాన్యాలు రాయడం రావడం లేదు. ఇక ఇతరుల గురించి ఏం చెబుతాం. ఏదయితేనేం ఇవాళ జగన్ కు దగ్గర. క్యాబినెట్ లో లేకపోయినా ప్రతిరోజూ నెట్ ప్రాక్టీసు చేసే ప్లేయర్. సచివాలయ శాసన కర్త కానీ శాసన సభ్యుడు కాదు. ఏదో కొంత ఇంగ్లీషు వచ్చు. దాంతో బండి లాగిస్తున్నాడు.
ఎలక్షన్ ఫండింగ్ కోసం సచివాలయంలో బేరాలు అవుతున్నాయి..కనుక ఆఖరి నిమిషంలో అన్నీ మారిపోతాయి.. చూడండి పెద్దిరెడ్డిని అందుకే తప్పించడు..అలానే చంద్రబాబు తిడతాడు కనుక కొడాలి నాని ఆయనకు హీరో..ఇదీ జగన్ వాదం. దీనికి అనుగుణంగానే సజ్జల రాజకీయం చేస్తాండు. ఏదో కాలం కలిసి వస్తే బూతుల మంత్రికి మళ్లీ ఛాన్స్ ఇస్తాడు. మొన్న మాస్టార్లంతా సజ్జలనే తిట్టారు. కాదు జగనే ఆయనను తిట్టించేలా చేశాడు. అయినా అన్నింటినీ భరిస్తున్నాడు. లోటు ఎక్కడున్న తన మాటతో భర్తీ చేస్తున్నాడు. సజ్జల అంటే బొత్సకు పడదు.
పెద్ది రెడ్డి కి కూడా పడదు. సాయిరెడ్డి అన్నా బొత్సకు పడదు. సాయిరెడ్డికి, సజ్జలకు అస్సలు పడదు. విశాఖ కేంద్రంగా కబ్జాలు చేస్తున్న సాయి రెడ్డి పై సీఎం నిఘా ఉంచారు. దాంతో త్వరలో వీటి వివరాలు అందితే రామకృష్ణా రెడ్డి సమీక్షించి సంబంధిత నివేదికను సీఎంకు అందించడం ఖాయం. అలానే రామకృష్ణా రెడ్డి స్వాముల చుట్టూ తిరగడు. జియరు స్వాముల పాదాలకు చెవిరెడ్డి మాదిరిగా మోకరిల్లడు. ఆ ఒక్క విషయంలో ఆయన టాప్.. నేను విశ్వాసాలు గౌరవిస్తాను. అలా అని నేను పాటించాలని రూలేం లేదు కదా అని అంటాడు. ఎనీవే ఇప్పుడు సజ్జల మాటే వేదం… శాసనం కూడా! ఆ విధంగా ఆయన ఉత్తమ పురుష.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి…