జై జ‌గ‌న్ : విన‌యంతో చెబుతున్నారు పొగ‌రుతో కాదు ? ఆహా !

-

ఐదేళ్లూ పాలించేందుకు అవ‌కాశం ద‌క్కింది. అందుకు జ‌గ‌న్ ఎంతో క‌ష్ట‌పడ్డారు. అవ‌మానాలు కూడా ప‌డ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎందుక‌నో ఖ‌జానా ఖాళీ అయింది. ఎందుక‌నో కాదు ఏడాదికి యాభై ఐదు వేల కోట్ల రూపాయ‌ల చొప్పున సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించి, ఉన్న ఆదాయంలో ఓ కొద్దిపాటి మాత్రమే మిగిల్చి, దానాలు చేస్తున్న వైనం కార‌ణంగా ఈ ప‌రిస్థితి త‌లెత్తింది అని విప‌క్షం నివ్వెర‌పోతోంది. వీటి కార‌ణంగానే చంద్ర‌బాబు త‌న ధోర‌ణిలో మార్పు తెచ్చుకుని ప్ర‌జా బ‌లం పెంచుకుంటున్న కార‌ణంగా ఆయ‌న త్వ‌ర‌లో ఎన్నిక‌లు ఖాయం చేయ‌నున్నారు. ఆయ‌న అన‌గా జ‌గ‌న్.

ఇందుకు ప్ర‌ధాని మోడీ స‌మ్మ‌తిస్తారో లేదో కానీ ? ఓ విధంగా ఇది త‌ప్పుడు నిర్ణ‌య‌మే కావొచ్చు లేదా మంచి నిర్ణ‌యం కూడా అయి తీర‌వచ్చు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త రాన్రూనూ పెరిగిపోతున్న త‌రుణాన ఇలాంటివి త‌ప్ప‌వు. త‌ప్పించుకోలేరు కూడా ! అందుకే స‌జ్జ‌ల విన‌యంతోనే ఈ మాట చెబుతున్నాను అని అన్నారు. పొగ‌రుతో కాదు అని కూడా చెప్పారు. జ‌గ‌న‌న్న పంచాయితీ ఇదే ! ఇందుకు సంబంధించి ఇప్పుడు నిర్థారితం అయిన విష‌యం.

అనున్న‌దేదో జ‌రిగే విధంగా ఉంది. ఏడుపు, న‌వ్వు క‌లిసే విధంగా కొన్ని నిర్ణ‌యాలు అమ‌లుకు నోచుకోనున్నాయి. దీంతో త్వ‌ర‌లోనే కొన్ని అనూహ్య నిర్ణ‌యాల వెల్ల‌డి జ‌ర‌గ‌నుంది. వైసీపీ స‌ర్కారు దిగ్విజ‌యంగా ప‌నిచేస్తుంది క‌దా ! మరెందుకు ముంద‌స్తుకు వెళ్ల‌డం అని మాత్రం అడ‌గ‌కండి. అది వాళ్ల ఇంట‌ర్న‌ల్ డెసిష‌న్. దానిని క్వ‌శ్చ‌న్ చేయ‌కూడదు. మే ప‌ది నుంచి గ‌డ‌ప‌గ‌డ‌పకూ వైసీపీ కార్య‌క్ర‌మం జ‌రిగాక అప్పుడు స‌ర్వే రిజ‌ల్ట్ వ‌చ్చాక, అటుపై క‌దా నిర్ణ‌యం తీసుకోవాలి. అయినా మేం ఐదేళ్లూ పాలిస్తాం అని చెప్పి ఇంత‌లోనే ఇలాంటి నిర్ణ‌యాలు ఎందుకు తీసుకోవ‌డం. ఓ విధంగా ఇది కేసీఆర్ ఫార్ములా.

కేసీఆర్-కు స‌ల‌హాలు ఇస్తున్న పీకే, ఇదే స‌ల‌హాను జ‌గ‌న్-కు ఇచ్చారా అన్న డౌట్ కూడా వ‌స్తోంది. అధికార పార్టీ స‌భ్యుల ప‌నితీరు, వారి స‌మ‌ర్థ‌త అన్న‌వి లెక్క‌తేల‌కుండానే, వాటిని లెక్క‌లోకి తీసుకోకుండానే ముంద‌స్తుకు పోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారా లేకా ఇంకేమ‌యినా పాల‌న ప‌ర‌మ‌యిన స‌మ‌స్య‌లున్నాయా? అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి. ప్లీన‌రీ (జూలైలో జర‌గ‌నుంది) త‌రువాత కదా! నిర్ణ‌యాలు చెప్పాలి మ‌రి ముందే ఎందుక‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అనే వైసీపీ పెద్ద మ‌రియు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మీడియాకు లీకులు ఇస్తున్నార‌ని?

Read more RELATED
Recommended to you

Latest news