చంద్రబాబుకు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే : సజ్జల

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బయట చెప్పుకోవడానికి కూడా సంకోచించే చర్మ వ్యాధిని ప్రాణాంతకంగా చూపుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని, అది కూడా కంటికి శస్త్రచికిత్స చేయించకోవడానికి మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. కానీ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? అని విమర్శించారు.

Sajjala: Sajjala Claims Violations In Vote Counting | Amaravati News -  Times of India

చంద్రబాబుకు కంటి శస్త్ర చికిత్స కు సంబంధించిన అంశానికి మాత్రమే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, ఎక్కడ గెలిచింది నిజం? స్కిల్ స్కాం జరుగలేదా?పెండ్యాల శ్రీనివాస్ పారిపోవటం వెనుక పాత్ర ఎవరిది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటకు ఎలా వస్తాడు? అని నిలదీశారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావటమే మాకు వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు లేదు అనటానికి ఉదాహరణగా పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో.. సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి చంద్రబాబు రిలీజ్‌ కానున్నారు.. రాజమండ్రి నుంచి విజయవాడకు ఆయన రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.. ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌ రాజమండ్రికి బయల్దేరి వెళ్లింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news