ప్రభాస్ ఫ్యాన్స్ షాక్..”సలార్” మూవీ కూడా వాయిదా ?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కే జి ఎఫ్ డైరె క్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సిని మా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2023, సెప్టెంబర్‌ 28 వ తేదీన రిలీజ్‌ కానుంది.

అయితే.. నిన్ననే ఆదిపురుష్‌ వాయిదా వేస్తున్నట్లు ఓం రౌత్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్‌ వాయిదా పడటంతో.. సలార్‌ కూడా పోస్ట్ పోన్‌ కావడం గ్యారంటీ అంటున్నారు. కేవలం 3 నెలల వ్యవధి లో ప్రభాస్‌ బ్యాక్‌ టు బ్యాక్ రిలీజ్‌ లను మేరర్స్‌ కోరుకోవడం లేదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. సలార్‌ ను వాయిదా వేయడం గ్యారంటీ అని.. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ కూడా వస్తుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news