గెలిచినా..ఓడినా..పోస్టుమార్టం తప్పట్లేదు..!

-

మునుగోడు ఉపఎన్నికలో టి‌ఆర్‌ఎస్ గెలిచింది..దాదాపు 10 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలిచింది. ఈక బీజేపీ అంతే మెజారిటీతో ఓటమి పాలైంది. అటు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 24 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి..అంటే డిపాజిట్ కోల్పోయింది. అయితే ఎక్కడైనా ఓడిన పార్టీలు..ఎందుకు ఓటమి పాలయ్యాం..ఎక్కడ పొరపాటు జరిగిందా? అనే అంశాలపై పోస్టుమార్టం చేస్తారు. కానీ గెలిచిన టి‌ఆర్‌ఎస్ సైతం..మనం చాలా చేశాం..దాదాపు అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం..అభివృద్ధి చేస్తున్నాం..అయినా సరే మెజారిటీ తగ్గడం ఏంటి అనే దానిపై పోస్టుమార్టం జరుగుతుంది.

ఓటర్లలో 99.5 శాతం మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే.. అయినా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమిటి? కనీసం లక్ష ఓట్లు కూడా రాకపోవడం ఏమిటి? 40 వేలకుపైగా ఆధిక్యత వస్తుందని అంచనా వేసుకుంటే పట్టుమని పది వేలు రావడం ఏమిటి? అని టి‌ఆర్‌ఎస్‌లో అంతర్మథనం కొనసాగుతుంది. నిజమే..అన్నీ రకాలుగా టి‌ఆర్‌ఎస్ చేస్తుంది..మరి అలాంటప్పుడు తక్కువ మెజారిటీ రావడం ఏంటి అనే దానికి కారణాలు వెతుక్కోవాలి..వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం..కొన్ని అంశాల్లో వెనుకబడటం జరిగాయి..దళితులకు మూడు ఎకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళిత బంధు, యువతకు ఉద్యోగాలు ఇలాంటి అంశాల్లో టి‌ఆర్‌ఎస్ ఫెయిల్ అయింది. అందుకే మునుగోడులో మెజారిటీ యువత బీజేపీకే ఓటు వేసింది. అటు బి‌జే‌పి సైతం ఓటమిపై పోస్టుమార్టం చేసుకుంటుంది.

టి‌ఆర్‌ఎస్‌కు ధీటుగానే బి‌జే‌పి పోరాడింది. కానీ కమ్యూనిస్టుల అండ, బి‌జే‌పి కంటే ఎక్కువగా అధికార బలం వాడటం, అదేవిధంగా బి‌జే‌పి నేతల్లో సమన్వయ లోపం ఉంది..హుజూరాబాద్ మాదిరిగా అందరూ కలిసికట్టుగా పనిచేయలేదు. ఎవరికి వారు సెపరేట్ వర్గంగా నడిచారు. ఇది బి‌జే‌పి పరిస్తితి. ఈక కాంగ్రెస్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు..ఆ పార్టీ అన్నీ రకాలుగా ఫెయిల్ అయింది..మరి ఓటమిపై ఏ విధంగా సమీక్షించుకుంటారో చూడాలి. మొత్తానికి ఓడినా, గెలిచినా సరే పార్టీలకు పోస్టు మార్టం తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news