ఇండియా పోలీసులకు ప్రపంచం సలాం…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడం అంటే సాధారణ విషయం కాదు. అభివృద్ధి చెందిన దేశాలు కరోనా వైరస్ ని కట్టడి చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయినా సరే మన దేశం మాత్రం ఎంతో సమర్ధవంతంగా కరోనా వైరస్ ని ఎదుర్కొంటుంది. ఎక్కడా కూడా కేసులు పెరగకుండా అన్ని విధాలుగా కరోనా వైరస్ ని మన దేశం కట్టడి చేయడం చూసి మన మీద కత్తులు నూరే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు.

ఇక మన దేశంలో పోలీసుల పాత్ర గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. చైనాలో కరోనా కేవలం ఊహాన్ నగరానికి మాత్రమే పరిమితం అయింది. అక్కడ చైనా అర్మీని వాడుకుంది. ఇటలీ లో కేవలం జనాభా ఆరు కోట్లు, ఆ తర్వాత స్పెయిన్, అమెరికాలో ఇలా ఎక్కడ చూసినా కేసులు బాగా ఉన్నాయి. పోలీసులు ప్రజలను కట్టడి చేయలేక అర్మీని దించాలి అని కోరుతున్నారు.

కాని మన దేశంలో పరిస్థితి అలా లేదు. కరోనా మొదలై దాదాపు నెల రోజులు అవుతుంది. అయినా సరే ఎక్కడా కూడా కేంద్ర బలగాలను వాడలేదు. 130 కోట్ల మంది ప్రజలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు బయటకు రాకుండా ఆపుతున్నారు. లాక్ డౌన్ ని సమర్ధవంతంగా ఎక్కడా కూడా కరోనకు భయపడకుండా అమలు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పోలీసుల మాట వినక జనాలు కరోనా బారిన పడుతున్న వేళ మన దేశంలో పోలీసులు సమర్ధవంతంగా కరోనా వైరస్ ని కట్టడి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news