కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరిగింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా నిలిపివేసిన సంగతి తెలిసందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు దాదాపు కన్‌ఫర్మ్ అయిపోయింది. ఆర్ ఆర్ ఆర్ నుంచి బయటకి రావడానికి రాజమౌళి 3 వారాలు ఒప్పుకున్నారట. ఒకవేళ ఇది వర్కౌట్ అవకపోయినా సూపర్ స్టార్ మహేష్ బాబు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇక ఈ సినిమాని లాక్ డౌన్ విరమించగానే యధావిధంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో 2021 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారట.
ఇక ఈ సినిమా తర్వాత కోరటాల శివ రెండు కథలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం, మరొకటి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోసం అని తెలుస్తుంది. కొరటాల శివ కెరీర్ లో రెండవ సినిమాగా మహేష్ బాబు తో శ్రీమంతుడు సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేయడమే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్ గాను నిలిచింది. ఇక ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే మహేష్ బాబు ఒక ఊరుని దత్తత కూడా తీసుకోవడం విశేషం.
ఇక కొరటాల శివ కెరీర్ లో మూడవ సినిమాగా ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ ని అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఉన్నది కంప్లీట్ సోషల్ మెసేజ్ అయినప్పటికి పక్కా కమర్షియల్ అంశాలను జోడించారు. అలాగే ఎన్.టి.ఆర్ ని చాలా కొత్తగా చూపించారు. అలాగే ఇప్పుడు కూడా కొరటాల ఆచార్య అవగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లతో ప్లాన్ చేసుకున్నారని లేటెస్ట్ న్యూస్. అయితే ఎవరితో ముందు సెట్స్ మీదకి వెళతారన్నది ఆచార్య రిలీజయ్యాక తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశు రాం తో సినిమాకి కమిటవగా ఎన్.టి.ఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రం తో సినిమా చేయనున్నాడు.