చిరు, చరణ్ నా స్నేహితులు.. సౌత్ సినిమాలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇంకా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ ఫిల్మ్ ను చూసి తెగ పొగిడేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల యాక్టింగ్ కు ప్రతీ ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ విజ్యువల్ వండర్ అని, అది తీయడం కేవలం జక్కన్న రాజమౌళికే సాధ్యమని అంటున్నారు.

 

ఈ క్రమంలోనే ఈ పిక్చర్ పైన, సౌత్ సినిమాలపైన తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. దక్షిణాది చిత్రాలపై సల్లూ భాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నానని, ఆయనతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నారు. చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తనకు మంచి స్నేహితులని చెప్పాడు.

salman khan
salman khan

చిరంజీవితో తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని పేర్కొన్న సల్లూభాయ్.. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతమని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ఆయనను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నాడు. చరణ్ కెరీర్‌లో బాగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు సల్మాన్.

అయితే, దక్షిణాది చిత్రాలు హిందీలో బాగా ఆడుతున్నాయని, కానీ, తమ చిత్రాలు మాత్రం సౌత్‌లో పెద్దగా ఆడవని అన్నారు. అది తనకు ఆశ్చర్యంగా అనిపిస్తుందని వివరించాడు సల్లూభాయ్. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ నార్త్ ఇండియాలో బాగా ఆడింది. త్వరలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇకపోతే సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ పిక్చర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ‘లూసిఫర్’ ఫిల్మ్ రీమేక్.

 

Read more RELATED
Recommended to you

Latest news