చైసామ్ విడాకులు…200 కోట్ల భరణం వద్దన్న సమంత..?

టాలీవుడ్ స్వీట్ కపుల్ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. 2016 లో ఈ జంట వివాహం చేసుకొని ఒకటి కాగా.. తాజాగా నిన్న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సామ్ చైతూ విడాకులు తీసుకుంటున్నారు అంటూ గత నెల రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా సమంత ముంబైకి మకాం మార్చడంతో విడాకులు పక్కా అంటూ వార్తలు వచ్చాయి. ఇక ముందు నుంచి వార్తలు వచ్చినట్టుగానే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఈ వార్త అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇది ఇలా ఉంటే సమంత నాగ చైతన్య నుండి భరణం గా 350 కోట్లు తీసుకుంటుంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అక్కినేని కుటుంబం సమంతకు 200 కోట్లు భరణం గా ఇచ్చేందుకు సిద్ధమైందని కానీ సమంతా ఆ డబ్బును తిరస్కరించిందని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత ఎలాంటి భరణం తీసుకోవడం లేదని అవి ఫేక్ వార్తలని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సామ్ నోరు విప్పాల్సిందే.