దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి చూపిస్తున్న బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలకు నేడు విడుదల కానున్నాయి. త్రుణమూల్ కాంగ్రెస్ తోపాటు మమతాబెనర్జీకి ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. సెప్టెంబర్ 30 తేదీన బెంగాల్ లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈసీ ఎన్నికలను నిర్వహించింది. అందులో భవానీపూర్ చాలా కీలకమైంది. మమతా బెనర్జీ ఇక్కడ నుంచి పోటీ చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలు ఎక్కువ ప్రాధాన్యతనలు సంతరించుకుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం లో త్రుణమూల్ కాంగ్రెస్ మెజారిటీ సాధించినా.. మమతా బెనర్జీ గట్టెక్కలేకపోయింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన దీదీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. అయినా సీఎం పీఠంను అధిష్టించినా ఆరు నెలల్లో అసెంబ్లీలో ప్రాతినిథ్యం సంపాదించాలి. దీంతో షబన్ దేవ్ ఛటోపాద్యాయ భవనీపూర్ ను దీదీ కోసం త్యాగం చేశారు. దీంతో భవానీ పూర్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో దీదీకి పోటీగా బీజేపీ తరుపున ప్రియాంక దిబ్రేవాల్ పోటీలో ఉన్నారు.