వేడుకోలు: సమంత కొంచం తొందరగా రావమ్మా.!

-

సినిమా ప్రపంచం తో పరిచయం వున్న వారికి సమంత గురించి పరిచయం అక్కరలేదు. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమాలు తగ్గించిన సమంత, నాగ చైతన్య తో విడాకుల తర్వాత మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ట్రెండింగ్ వుంటోంది. ఇంకో రెండు సంవత్సారాల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవంటే తన జోరు ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.

కాని సమంత ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని వల్ల చాలా మంది నిర్మాతలు చాలా టెన్షన్ పడుతున్నారు సమంత  ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా 11-11-2022 నాడు థియేటర్లలో  విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సమంత లేకపోవడం నిర్మాతలకు చుక్కలు కనపడుతున్నాయి.ఎందుకంటే ఈ సినిమా మొత్తం సమంత పేరు మీదే బిజినెస్ జరిగింది.

దీనితో పాటుగా విజయ్ దేవర కొండ తో ఖుషి సినిమా షూటింగ్ కూడా కొంత బాగం పూర్తి అయ్యింది. ఇంకొంత భాగం పెండింగ్ లో వుంది. ఇప్పుడు సమంత హాస్పిటల్ లో వుండడం విజయ్ ను నిర్మాతలను తెగ కంగారు పెడుతోంది.కాని సమంత ఆరోగ్య పరిస్తతి బాగుపడక పోతే ఈ సినిమా పరిస్తితి తలకిందులు అయ్యే అవకాశం ఉంది. అందుకే వారు సమంత కు తొందరగా తగ్గి మళ్లీ నార్మల్ హెల్త్ తో రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news