‘ఆర్​ఆర్​ఆర్’​ బ్యూటీ అలియాపై సమంత హాట్ కామెంట్స్​..

-

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండగా… టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా గంగుబాయి కతీయ వాడి.

ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా బట్ వేశ్య గా నటించడం… సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా ఇందులో ఆలియా భట్ నటించిన నటన తో… అందరూ ఫిదా అయిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత కూడా ఆలియా భట్ నటన పై కామెంట్ చేశారు. “గంగు భాయ్ కతీయ వాడి ఓ కళాఖండం. ఆలియా భట్ మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతి ఒక్క డైలాగు, హావభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచి పోతాయి. ఫెంటాస్టిక్ జాబ్. అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకు వచ్చింది. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్ లాంటి తారలు కూడా ఆలియా నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news